Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ పాలిసెట్ -2020 ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. కాని కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపుతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాయిదా పడుతూ వచ్చిన టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు చేసింది.
 
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే పాలిసెట్ మొదటి విడత ప్రవేశాలకు సెప్టెంబరు 12వ తేదీ నుంచి జరగనుంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు 12వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించనున్నారు. అనంతరం వెబ్ ఆప్షన్‌ను విద్యార్థులు 14 నుంచి 20 వరకు ఇచ్చుకోవాలి. 
 
22నుంచి సీట్ల కేటాయింపు జరగనుంది. ఇక పాలిసెట్ తుది విడత ప్రవేశాలు ఈ నెల 30 నుంచి నిర్వహంచనున్నారు. వెబ్ ఆప్షన్లు 30వ తేదీన, అక్టోబరు 1న ఇచ్చుకోవాలి. తుది విడత ప్రవేశాలకు సీట్లు కేటాయింపు అక్టోబరు 3న చేస్తారు. ఇక ప్రక్రియ పూర్తయిన అనంతరం పాల్ టెక్నిక్ విద్యాసంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా అక్టోబరు15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments