Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే నాన్ గెజిటెట్ ఉద్యోగాల్లో అగ్నివీర్‌కు రిజర్వేషన్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (12:56 IST)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నివీర్‌లకు భారతీయ రైల్వే శాఖలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీలో దశలవారీగా 15 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. అలాగే, వయోపరిమితిలో కూడా సడలింపు ఇస్తారు. వీటితో పాటు ఫిజికల్ టెస్టుల్లో కూడా ఈ సడలింపు వర్తించనుంది. 
 
దివ్యాంగులు (పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్-1లో 10 శాతం, లెవెల్-2, అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను అగ్నివీర్‌కు కల్పిస్తారు. తొలిబ్యాచ్ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. 
 
నాలుగేళ్లు అగ్నివీర్లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు లేఖలు పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments