Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీపీఎస్సీ నుంచి శుభవార్త.. ప్రొఫెసర్ల పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (19:49 IST)
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. వివిధ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 87 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 87 అధ్యాపక ఉద్యోగాల్లో ప్రొఫెసర్‌, రీడర్‌, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 7వ తేదీ వరకు గడువు విధించింది.  
 
దరఖాస్తు చేసుకునేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవాలని తప్పుగా నింపిన దరఖాస్తులను కమిషన్ పరగణలోకి తీసుకోదని నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు ప్రక్రియల ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఎంపీపీఎస్సీ తెలిపింది. 
 
ఎంపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ లింకును క్లిక్ చేయాల్సి వుంటుంది. మొబైల్ నెంబర్‌, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫామ్‌ను పూర్తిగా ఫిల్ చేయాలి. అనంతరం దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments