Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడి.. పూణె విద్యార్థి టాప్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:38 IST)
దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ 2020 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో పూణే నగరానికి చెందిన విద్యార్థి చిరాగ్ ఫాలోర్ టాపర్‌గా నిలిచారు. ఈ విద్యార్థి 396 మార్కులకుగాను 352 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 
 
ఇకపోతే, ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 1.6 లక్షలమంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, 96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఐఐటీ బాంబే జోనుకు చెందిన చిరాగ్ ఫాలోర్ 352 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.
 
ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలోని కనిష్క మిట్టల్ అమ్మాయిల్లో 315 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. జేఈఈ అడ్వాన్సుడు పరీక్షల్లో సాధించిన ర్యాంకులను బట్టి దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశ ప్రక్రియను జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా) చేపడుతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments