Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్ డిగ్రీలు రద్దు... సుప్రీంకోర్టు షాక్

దేశంలో నాలుగు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ వర్శిటీలు నిర్వహిస్తున్న కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థుల ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దుచేసింది

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (13:12 IST)
దేశంలో నాలుగు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ వర్శిటీలు నిర్వహిస్తున్న కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థుల ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దుచేసింది. వీటిలో జేఆర్‌ఎన్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (రాజస్థాన్‌), అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, వినాయక మిషన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (తమిళనాడు) 2001 నుంచి కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ప్రదానం చేసిన ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దు చేస్తూ జస్టిస్‌ ఏకే గోయల్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 
 
అయితే డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (దూరవిద్య) ద్వారా కోర్సు పూర్తిచేసిన 2001-05 బ్యాచ్‌ విద్యార్థులు.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్వహించే పరీక్షకు హాజరై డిగ్రీలు పొందవచ్చని స్పష్టంచేసింది. మిగతా బ్యాచ్‌ల విద్యార్థుల డిగ్రీలను మాత్రం రద్దుచేసింది. ఆ కాలానికి సదరు డీమ్డ్‌ వర్సిటీలు ఆ కోర్సు కోసం ఎలాంటి అనుమతులూ తీసుకోకపోవడమే దీనికి కారణంగా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments