Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ICAME2018 : ఎస్ఆర్ఎంలో మెకానికల్ ఇంజనీరింగ్‌పై అంతర్జాతీయ సదస్సు

తమిళనాడులో ఉన్న అగ్రగామి విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌పై రెండో అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (15:26 IST)
తమిళనాడులో ఉన్న అగ్రగామి విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌పై రెండో అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సు ఈనెల 24వ తేదీ వరకు జరుగనుంది. ఈ సదస్సులో అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన మేధావులు పాల్గొని తమతమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన అనేక మంది స్పీకర్లు పాల్గొనున్నారు. అలాగే, 520 టెక్నికల్ పత్రాలను ఇందులో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, ఈ సదస్సులో భాగంగా, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం గురువారం కాట్టాన్‌కొళత్తూరులోని ఎస్ఆర్ఎన్ డీమ్డ్ వర్శిటీ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ టీపీ గణేశన్ ఆడిటోరియంలో జరిగింది.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ ఎస్. ప్రభు ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. అలాగే, ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఛాన్సలర్ డాక్టర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షోపన్యాసం చేశారు. అలాగే, ఈ కార్యక్రమంలో టమకాంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ లంగ్ జియ్ యంగ్కే, కేఆర్ఐఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ జిన్ పార్క్, యూకేకు చెందిన ఆండ్రిన్ హ్యారీస్ మైక్రో మెటీరియల్స్, ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ చాన్సలర్ డాక్టర్ సందీప్ సంచేటి, స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ డి.కింగ్లీజెబా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు డిప్యూటీ హెడ్ డాక్టర్ టి. రాజశేఖరన్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments