Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యావసర సరకులు డెలివరీకి జొమాటో స్వస్తి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:29 IST)
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ డెలివరీ కాలం సాగుతోంది. ఏది కావాలన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికి వచ్చేస్తుంది. కాగా ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ జోమాటో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. 
 
క‌రోనా నుంచి కోలుకుంటుండ‌టంతో ఫుడ్ డెలివ‌రీకి డిమాండ్ పెరుగుతుంది. నిత్య‌ావ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ కంటే, ఫుడ్ డెలివ‌రీకే వినియోగ‌దారులు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో నిత్య‌వ‌స‌ర సేవ‌ల డోర్ డెలివ‌రీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ సేవలను ఈ నెల 17వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
గ‌తేడాది ఓసారి ఈ నిర్ణ‌యం తీసుకోగా, జులై నెల‌లో ఈ సేవ‌ల‌ను తిరిగి ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఫుడ్ డెలివ‌రీకి డిమాంట్ పెరుగుతున్న నేప‌థ్యంలో నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల సేవ‌ల‌నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.
 
తమకు ఆర్డర్లు వస్తున్నంత వేగంగా సరుకులు అందించలేకపోతుండడంతో అప్పట్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎంపిక చేసిన నగరాల్లో మాత్రం ముప్పావుగంటలోపే నిత్యావసర సరుకులు అందిస్తామంటూ ఈ ఏడాది జులైలో మళ్లీ ప్రకటించింది. 
 
ఇప్పుడు మరోమారు ఆ సేవల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. కాగా, నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటో దాదాపు రూ.745 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments