Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు ఇవ్వనున్న జియోమీ సంస్థ... వడ్డీరేటు రూ.2 లోపే

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:15 IST)
భారతదేశంలో మొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న జియోమీ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మొబైల్స్ మాత్రమే కాకండా టీవీలు, ఎయిర్ ప్యూరిఫైయర్స్, పవర్ బ్యాంక్‌లు, ఇయర్ ఫోన్స్ వంటి మొబైల్ యాక్సెసరీస్‌ను వినియోగదారులకు అందించిన జియోమీ  సంస్థ ఇప్పుడు ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో అడుగుపెట్టబోతోంది. 
 
కన్సూమర్ లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. జియోమీకి చెందిన Mi Credits యాప్ ద్వారా వినియోగదారులకు అప్పులు ఇవ్వనుంది. కాగా ఇప్పటికే జియోమీ సంస్థ Mi Pay మొబైల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది. త్వరలో Mi Credits యాప్‌తో ఇండియాలో అప్పులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
 
Mi Credits సర్వీస్ ద్వారా జియోమీ సంస్థ యూజర్లకు ఒక్కొక్కరికి రూ.1,00,000 వరకు లోన్ ఇవ్వనుంది. వడ్డీ రేట్లు 1.8 శాతం నుంచి ప్రారంభమౌతాయి. అంటే రూ.2 రూపాయల లోపే అన్న మాట. మరికొన్ని వారాల్లో ఈ జియోమీ లోన్ సర్వీస్ భారత్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీస్ బీటా ఫేజ్‌లో ప్రారంభమైంది. 
 
బీటా ఫేజ్ విజయవంతం అయితే త్వరలోనే Mi Credit యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. భారత్‌లో ఇప్పటికే ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. వీటన్నింటికీ పోటీగా జియోమీ వస్తోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచలనాలను సృష్టించిన జియోమీ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్‌లో కూడా సంచలనాలను నమోదు చేస్తుందేమో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments