భారతీయ మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న షిమోమీ సంస్థ ఈ నెల 18వ తేదీన బ్లాక్ షార్క్ 2 గేమింగ్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, లిక్విడ్ కూలింగ్ 3.0 టెక్నాలజీ, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై వెర్షన్ తదితర ఫీచర్లను పొందుపరచనున్నట్లు తెలిపింది. ఇంకా ఫోన్‌కి సంబంధించిన ఇతర ఫీచర్ల వివరాలు తెలియాల్సి ఉంది.
త్వరలో పూర్తి స్థాయి ప్రత్యేకతలను షియోమీ సంస్థ ప్రకటించనుంది. ఈ ఫోన్‌ను ముందుగా చైనా మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కాగా గేమింగ్ సిరీస్‌లో షియోమీ సంస్థ విడుదల చేస్తున్న రెండో ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ వన్‌ప్లస్ 6టి, గెలాక్సీ ఎస్10 ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.