225 పట్టణాల్లో సేవలను నిలిపివేసిన జొమాటో

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (11:11 IST)
దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జొమాటో దేశ వ్యాప్తంగా 225 పట్టణాల్లో తన సేవలను నిలిపివేసిసింది. గత యేడాది డిసెంబరు నెలతో ముగిసిన మూడో త్రైమాసిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
ఇదే అంశంపై జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షత్ గోయల్ స్పందిస్తూ, జనవరి నెలలో కంపెనీ వ్యాపారం గురించిన కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 225 చిన్న పట్టణాల్లో జొమాటో సేవలను నిలిపివేసినట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థుతులు అనేక సవాళ్లను విసురుతున్నాయని, త్వరలోనే ఇవన్నీ సర్దుకుని పోతాయని భావిస్తున్నట్టు తెలిపారు. 
 
చిన్న పట్టణాల్లో తమ సంస్థ సేవలను మూసివేయడానికి ప్రధాన కారణం.. సరైన వ్యాపారం లేకపోవడమేనని చెప్పారు. అయితే, పట్టణాల్లో వ్యాపారం మూసివేయడం వల్ల కంపెనీ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అక్టోబరు - డిసెంబరు త్రైమాసిక నివేదిక ప్రకారం కంపెనీ ఆదాయం 75 శాతంగా పెరిగి 1948 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. నష్టం మాత్రం మూడు రెట్లు పెరిగి 346 కోట్ల రూపాయలకు చేరుకుందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments