Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్‌లో 24.9 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. వాల్ మార్ట్‌ అదుర్స్

Webdunia
బుధవారం, 15 జులై 2020 (11:31 IST)
2018లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో 70 శాతం వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ స్టార్టప్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్, ఆపై ఇండియాలో అమేజాన్‌కు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. వాల్ మార్ట్ సంస్థ మరో 1.2 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనుంది. 
 
ఇప్పటికే ఫ్లిఫ్ కార్టులో పలు దఫాలుగా పెట్టుబడి పెట్టిన వాల్ మార్ట్ మెజారిటీ వాటాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్, ఈ పెట్టుబడితో సంస్థ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా, ఈ పెట్టుబడి సంస్థకు రానుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. 
 
ఈ నిధులతో తమ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తామని, కరోనా కష్టాల నేపథ్యంలో ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ భారత్‌లో నానాటికీ విస్తరిస్తున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments