Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌ను ఆవిష్కరించిన వోక్స్‌వ్యాగన్‌ ఇండియా

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (16:50 IST)
భారతదేశపు మార్కెట్‌ కోసం వోక్స్‌ వ్యాగన్‌ సంస్ధ నేడు తమ అంతర్జాతీయ సెడాన్‌ వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌ను నేడు విడుదల చేసింది. డిజైన్‌ పరంగా పెద్దగా ఉండే నూతన వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌, శక్తివంతమైన, భావోద్వేగ డిజైన్‌ భాషను కలిగి ఉండటంతో పాటుగా పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిన లక్షణాన్నీ ప్రదర్శిస్తుంది.


వోక్స్‌వ్యాగన్‌ కుటుంబంలో నూతన సభ్యునిగా మాత్రమే గాక ప్రీమియం మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలో తాజా ప్రవేశకునిగా నూతన వర్ట్యుస్‌ చూడగానే ఆకట్టుకునే, ఉల్లాసకరమైన, జర్మన్‌ ఇంజినీర్డ్‌ వాహనం, ఈ విభాగాన్ని పునరావిష్కరించే శక్తి కలిగి ఉండటంతో పాటుగా సెడాన్‌ పట్ల ప్రేమనూ పునరుత్తేజపరుస్తుంది.

 
ఇండియా 2.0 ప్రాజెక్ట్‌ కింద తీర్చిద్దిబడిన రెండవ ఉత్పత్తి వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌. దీనిని ఎంక్యుబీ ఏఐఇన్‌ ప్లాట్‌ఫామ్‌పై 95% స్ధానికీకరణతో తీర్చిదిద్దారు. ఈ ప్లాట్‌ఫామ్‌ యొక్క ఫ్లెక్సిబిలిటీ నూతన వర్ట్యుస్‌ను ఈ విభాగంలో పొడవైన కారు (4,561 మిల్లీమీటర్లు)గా మారుస్తుంది. ఇది తగినంతగా క్యాబిన్‌ మరియు బూట్‌ స్పేస్‌ (521 లీటర్లు)ను వినియోగదారులకు అందిస్తుంది. ప్రతి వోక్స్‌వ్యాగన్‌కూ తగిన రీతిలో ఈ కార్‌లైన్‌, బ్రాండ్‌ యొక్క అసలైన డీఎన్‌ఏను ప్రతిబింబిస్తుంది. అత్యున్నత శ్రేణి నిర్మాణ నాణ్యత, భద్రత మరియు వినోదాత్మక డ్రైవింగ్‌ అనుభవాలను అందిస్తుంది.

 
‘‘అంతర్జాతీయంగా వోక్స్‌వ్యాగన్‌ బ్రాండ్‌ యొక్క సెడాన్‌ జాబితాను మరింతగా వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌ తీసుకువెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెడాన్‌ విభాగంలో 61 సంవత్సరాలుగా ఉంటూ 129 మోడల్స్‌ను వోక్స్‌వ్యాగన్‌ విక్రయించింది. అసలైన అంతర్జాతీయ కార్‌లైన్‌గా ఇది భారతదేశంలోని  ప్రీమియం మిడ్‌ సైజ్‌ సెడాన్‌ విభాగంలో నూతన బెంచ్‌మార్క్స్‌ను ఏర్పరుస్తూ ఈ విభాగాన్ని పునర్నిర్వచించడంతో పాటుగా శక్తివంతమూ చేయనుంది. తన శక్తివంతమైన, భావోద్వేగ డిజైన్‌ భాషతో పాటుగా విశాలవంతమైన ఇంటీరియర్స్‌, పనితీరు మరియు టీఎస్‌ఐ టెక్నాలజీతో మేము మా వినియోగదారుల హృదయాలను గెలుచుకోగలము’’ అని ఆశీష్‌ గుప్తా, బ్రాండ్‌ డైరెక్టర్‌, వోక్స్‌వ్యాగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా అన్నారు.

 
‘‘నూతన  వోక్స్‌వ్యాగన్‌ వర్ట్యుస్‌, ప్రీమియం మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలో అద్భుతం తప్ప మరేమీ అందించదు. ఈ విభాగంలో అతిపెద్ద కారుగా, విశాలవంతమైన ప్రాంగణమనేది మా వినియోగదారలకు ఇక ఎంత మాత్రమూ రాజీపడే అంశం కాదు. దీనియొక్క ఆత్మవిశ్వాసం కలిగిన లక్షణంతో ఈ నూతన వర్ట్యుస్‌, అత్యుత్తమ శ్రేణి ఫీచర్లను  శక్తివంతమైన మరియు పెర్‌ఫార్మెన్స్‌ లైన్‌లో కలిగి ఉండటంతో పాటుగా భారతీయ వినియోగదారుల కోరికలకు అనుగుణంగా ఉండి ఆకట్టుకుంటుంది. పనితీరు శ్రేణిలో వర్ట్యుస్‌ యొక్క వ్యక్తిత్వాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఇవి కారుకు ప్రత్యేకమైన లక్షణాలను అందించే ఐకానిక్‌ జీటీ అంశాలు“ అని అశీష్‌ గుప్తా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments