Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యాకు ఊహించని షాక్.. లండన్‌లో అరెస్టు.. త్వరలో భారత్‌కు

లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ ఒత్తిడి మేరకు ఆయనన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుల

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (16:20 IST)
లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ ఒత్తిడి మేరకు ఆయనన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత భారత్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యా 2016 మార్చి 2న లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి పారిపోయిన ఆయన ప్రస్తుతం ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో గల ఓ గ్రామంలో తలదాచుకుంటున్నారు. 
 
అప్పటినుంచి ఆయన్ను భారత్‌కు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మాల్యా వీసాను కూడా కేంద్రం రద్దు చేసింది. మాల్యాను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించేయాలని భారత విదేశాంగ శాఖ.. యూకే ప్రభుత్వాన్ని కోరింది. అయితే అది సాధ్యం కాదని అప్పట్లో యూకే చెప్పింది.
 
ఈనేపథ్యంలో మాల్యాను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగం సిద్ధం చేసింది. విచారణకు రావాలని అనేక నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత్‌కు రాలేనని మాల్యా అప్పట్లో ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. అయితే రుణాల విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
 
మరోవైపు మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్‌ వేసింది. అయితే దీనిపై కూడా మాల్యా స్పందించకపోవడంతో ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఆయనపై ఓపెన్‌ ఎండెడ్‌ నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments