Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు విజయ్ మాల్యా బంపర్ ఆఫర్.. రూ.13,960 కోట్లు చెల్లిస్తానని?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:54 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా త్వరలో ఎదుర్కోవాల్సిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నాడు. 
 
తాను చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 13,960 కోట్లను చెల్లిస్తానని ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదనను మాల్యా తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపాడు. అయితే రుణాల ఎగవేత కోసుల్లో ఢిల్లీ కోర్టు మాల్యాకు 2016లో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
 
ఈడీ కేసులో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ అయ్యింది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని విజయ్ మాల్యాపై ఆరోపణలున్నాయి.
 
పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్‌లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. అనంతరం విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments