Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలెంటైన్స్ డే... ఎవరి బుట్టలో ఎవరు పడుతున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (16:18 IST)
ప్రేమికులు ఎదురుచూసే వాలెంటైన్స్ డే రానే వచ్చింది. ఈరోజు పార్కుల్లో, పబ్‌లలో, మాల్స్, హోటళ్లలో ఎక్కడ చూసినా జంటలు జంటలుగా కనిపిస్తారు. అయితే ఈ వాలెంటైన్స్ డే ప్రేమికులకు ఎలా ఉంటుందో కానీ, వ్యాపారులకు మాత్రం పండుగ రోజు.
 
ఈ ఒక్కరోజే కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అసోచాం లెక్కల ప్రకారం కేవలం ఒక్క ఆన్‌లైన్‌లోనే 25 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతందని అంచనా. ఇంకా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, నగల దుకాణాలు, చాక్లెట్లు, పూవ్వులు, వస్త్ర దుకాణాల వంటి వ్యాపారాల్లో అనేక ఆఫర్లు పెట్టి ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. వాలెంటైన్స్ డే మార్కెట్ విలువ ప్రతి ఏడాది 25 నుండి 30 శాతం పెరుగుతోంది.
 
వాలెంటైన్స్ డే కోసం వ్యాపారులు నెల రోజుల ముందు నుంచే ప్రకటనలు ఇస్తూ ఉంటారు. 2013లో వాలెంటైన్స్ డే మార్కెట్ విలువ 13 వేల కోట్లు ఉండగా 2019 నాటికి 30 వేల కోట్లకు చేరింది. అయితే ఒక సర్వే ప్రకారం వాలెంటైన్స్ డే రోజున ఎక్కువగా ఖర్చు పెట్టేది పురుషులేనట, దాదాపు 65 శాతం మంది పురుషులు తమ ప్రేమికురాలికి బహుమతులు కొనడానికి ఆసక్తి చూపుతుండగా ఆడవారు కేవలం 35 శాతం మంది మాత్రమే తమ ప్రేమికుడి కోసం గిఫ్ట్‌లు కొంటున్నారట. ఏదేమైనా వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు తమ భాగస్వామిని బుట్టలో పడేసారు అనడం కంటే వారే వ్యాపారుల బుట్టలో పడిపోయారనే మాటే నిజం కదా.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments