Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు వ్యాపారి నుంచి లెక్క తేలని రూ.వెయ్యి కోట్లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (16:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారి నుంచి లెక్కల్లో చూపని రూ.1000 కోట్లను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 4న చెన్నై, ముంబై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, త్రిసూర్, నెల్లూర్, జైపూర్, ఇండోర్‌లోని 27 చోట్ల దాడులు చేసినట్టు సీబీడీటి ప్రకటించింది. 
 
సోదాలకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించింది. అయితే, ఆ వ్యాపారి ఎవరు అన్న వివరాలను మాత్రం బహిర్గతం చేసింది. దాడుల సందర్భంగా లెక్క తేలని డబ్బు లావాదేవీలు, ఆ సంస్థ నుంచి బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుగోళ్ల రూపంలో రుణ చెల్లింపుల డమ్మీ ఖాతాలు, నోట్ల రద్దు సందర్భంగా ఖాతాల్లో డిపాజిట్ చేసిన లెక్క తేలని డబ్బు, వివరాల్లేని స్టాక్‌లను గుర్తించినట్టు పేర్కొంది. 
 
స్థానికంగా ఉన్న వారి దగ్గరి నుంచి అప్పులు తీసుకుని బిల్డర్లకు రుణాలిచ్చారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని చెప్పింది. ఇక, బంగారం అక్రమ కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. తనకు అప్పులున్నట్టు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, పాత బంగారాన్ని నగల తయారీకి వాడుకున్నట్టు చెప్పాడని పేర్కొంది. మొత్తంగా ఆ వ్యాపారి నుంచి రూ.1000 కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments