అలా చేస్తేనే పెట్రో ధరలు నేలకు దిగుతాయ్ : ఫడ్నవిస్

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.84గా ఉండగా, చెన్నైలో రూ.80గా ఉంది. అలాగే, వివిధ మెట్రో నగరాల్లో కూడా ఈ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి

Webdunia
గురువారం, 24 మే 2018 (13:50 IST)
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.84గా ఉండగా, చెన్నైలో రూ.80గా ఉంది. అలాగే, వివిధ మెట్రో నగరాల్లో కూడా ఈ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలపై అన్ని విపక్ష పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారిలో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ఈయన ఓ చిన్న ఉపాయం చెప్పారు.
 
అదేంటంటే... పెట్రోల్ ధరలకు కళ్లెం వేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల తాము వివిధ పన్నులను తగ్గించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదన్నారు. 'ఇప్పటికే మేము వివిధ పన్నులను చాలావరకు తగ్గించాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండడం వల్ల ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి పెట్రోల్‌ను జీఎస్టీ కిందికి తెచ్చేలా జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అప్పుడే పెట్రోల్ ధరలు దిగివస్తాయి' అని వ్యాఖ్యానించారు. మరి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments