Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొయోటా రూమియన్: లిమిటెడ్ ఫెస్టివల్ ఎడిషన్‌ను పరిచయం చేసిన టొయోటా మోటర్

ఐవీఆర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (21:11 IST)
కార్ల కొనుగోలుదారుల కోసం ఈ పండుగ సీజన్‌ను ప్రత్యేకంగా మలుస్తూ టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) ఈరోజు టొయోటా రూమియన్ యొక్క ఫెస్టివ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ప్రత్యేకమైన టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (TGA) ప్యాకేజీలను కలిగి ఉన్న ఈ లిమిటెడ్-ఎడిషన్ సీజన్‌ను చక్కగా మరియు ఆకర్షణీయమైన శైలిలో జరుపుకోవడానికి సరైన మొబిలిటీ ఎంపికగా నిలుస్తుంది. 
 
రూమియన్ యొక్క ఈ పండుగ ఎడిషన్, అన్ని గ్రేడ్‌లలో అందుబాటులో ఉంది, కస్టమర్‌లు ప్రీమియం అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారని నిర్ధారిస్తూ రూ. 20,608 విలువైన డీలర్-ఫిట్టేడ్ టిజిఎ  ప్యాకేజీతో వస్తుంది. ఫెస్టివ్ ఎడిషన్‌ పరిచయంపై టొయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “మా కస్టమర్‌లకు అసాధారణమైన విలువను అందించాలనే మా నిబద్ధత లో భాగంగా ఈ ప్రత్యేక ఎడిషన్ ను  ప్రీమియం యాక్సెసరీలు, అత్యుత్తమ విక్రయానంతర సేవలతో పాటుగా పొడిగించిన వారంటీలతో అందిస్తున్నాము. ఇవన్నీ భారతీయ కొనుగోలుదారుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఖచ్చితంగా రూపొందించబడ్డాయి" అని అన్నారు. 
 
టొయోటా రూమియన్ ఇప్పటికే ఒక వైవిధ్యమైన మరియు కుటుంబ-స్నేహపూర్వక ఎంపివి వలె చక్కటి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. విశాలమైన ఇంటీరియర్స్, ఇంధన సామర్థ్యం మరియు ఉన్నతమైన భద్రతా లక్షణాలను సజావుగా మిళితం చేసింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు స్మూత్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఎంపికను అందిస్తూ, ఈ ఎంపివి నియో డ్రైవ్ (ఐఎస్ జి)తో శక్తివంతమైన కె సిరీస్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో అందుబాటులో ఉంది. అత్యాధునిక కె -సిరీస్ ఇంజిన్ పెట్రోల్ వేరియంట్‌కు 20.51 km/l మరియు CNG వేరియంట్‌కు 26.11 km/kg అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments