Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరికొత్త అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను విడుదల చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్

TAISOR

ఐవీఆర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:34 IST)
భారతదేశంలో తమ బలమైన, పూర్తి శ్రేణి వైవిధ్యమైన SUV లైనప్‌కు డైనమిక్ జోడింపుగా ఈరోజు పూర్తి సరికొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) విడుదల చేసింది. A-SUV విభాగంలోకి కంపెనీ రీ-ఎంట్రీని గుర్తుచేస్తూ, పూర్తి సరికొత్త  టొయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఆధునిక స్టైలింగ్, అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతలను కలిగి ఉంది. పూర్తి సరికొత్త అర్బన్ క్రూయిజర్ టైజర్ 1.0L టర్బో, 1.2L పెట్రోల్, E-CNG ఎంపికలలో అందుబాటులో ఉంది. 1.0L టర్బో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది, తద్వారా పవర్ మరియు పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యతలు రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్‌లకు వైవిధ్యమైన ఎంపికను అందిస్తుంది. 1.2L పెట్రోల్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ గేర్ షిఫ్ట్ (IGS)లో వస్తుంది, 1.2L E-CNG 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది.
 
ఈ కార్యక్రమానికి హాజరైన టొయోటా కిర్లోస్కర్ మోటర్ యొక్క ఎండి & సీఈఓ- టొయోటా మోటర్ కార్పొరేషన్ (TMC) రీజినల్ సీఈఓ శ్రీ మసకాజు యోషిమురా మాట్లాడుతూ, “ భారతీయ మార్కెట్ ఎల్లప్పుడూ మాకు చాలా ముఖ్యమైనది. మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా& ఓషియానియా ప్రాంతంకి కేంద్రంగా భారతీయ మార్కెట్ కీలకమైన పాత్రను పోషిస్తుంది. మార్కెట్‌లో మా వ్యాపార వ్యూహం స్థానికీకరణ యొక్క జాతీయ ప్రాధాన్యతలకు సహకారం అందించడం, అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని అభివృద్ధి చేయడం, కార్బన్ లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టడంగా ఉంది. దీనితో పాటుగా, కస్టమర్ ఫస్ట్ కల్చర్ రాబోయే సంవత్సరాల్లో మా మార్కెట్ వ్యూహాన్ని నిర్వచించడం కొనసాగిస్తుంది" అని అన్నారు. 
 
ఈ సందర్భంగా సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ టికెఎం&లెక్సస్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తదాషి అసజుమా మాట్లాడుతూ, “ఈరోజు మేము మా వైవిధ్యమైన వాహన శ్రేణికి అసాధారణమైన జోడింపుగా పూర్తి సరికొత్త అర్బన్ క్రూయిజర్ టైజర్‌ను జోడించాము. గత కొద్ది సంవత్సరాలుగా, మారుతున్న జీవనశైలి ప్రాధాన్యతలను నిరంతరం స్వీకరించడం ద్వారా అసమానమైన కస్టమర్ ఆనందాన్ని అందించడం లక్ష్యంగా చేసుకున్నాము " అని అన్నారు.
 
కొత్త ఆవిష్కరణ పై టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శబరి మనోహర్ మాట్లాడుతూ, “పూర్తి సరికొత్త  అర్బన్ క్రూయిజర్ టైజర్ పవర్ ప్యాక్డ్ పనితీరు, అత్యుత్తమ శ్రేణి ఇంధన సామర్థ్యం, అద్భుతమైన బాహ్య రూపాన్ని మిళితం చేసింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన భద్రతా ఫీచర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ & ఇతర అధునాతన ఫీచర్‌లతో పాటు రోల్ ఓవర్ మిటిగేషన్ సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తాయి" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటీస్ పీరియడ్ అవసరంలేదు, ఈరోజు నుంచి ఉద్యోగం మానేయండి: బైజుస్ లేఆఫ్