Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' టొయోటా హైలక్స్ విడుదల

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (12:43 IST)
Toyota Hilux
ఎట్టకేలకు దేశీయ మార్కెట్లోకి కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' విడుదలైంది. భారత మార్కెట్లో హైలక్స్ ధరలు రూ.33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును కంపెనీ మూడు వేరియంట్లలో విడుదల చేసింది. టొయోటా కొంతకాలం క్రితమే హైలక్స్ పికప్ కోసం బుకింగ్‌ను నిలిపివేసింది. 
 
మార్కెట్ సమాచారం ప్రకారం, వచ్చేనెలలో టొయోటా హైలక్స్ డెలివరీలు ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అలాగే, ఈ మోడల్ కోసం వచ్చిన అనూహ్య స్పందన కారణంగా, దీని వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీ ఈ మోడల్ బుకింగ్‌‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
 
అమెరికా వంటి దేశాల్లో పికప్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మనదేశంలో పికప్ ట్రక్కులను కేవలం వాణిజ్య ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే, అమెరికాలో మాత్రం వీటిని సాధారణ వాహనాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో, భారతదేశంలో కూడా రెగ్యులర్ పికప్ ట్రెండ్‌ను ప్రారంభించేందుకు టొయోటా తమ హైలక్స్‌ను తీసుకువచ్చింది.
 
భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్ - రూ.33.99 లక్షలు హైలక్స్ మ్యాన్యువల్ హై - రూ.35.80 లక్షలు హైలక్స్ ఆటోమేటిక్ హై - రూ.36.80 లక్షలు పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా. ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments