Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు.. కొత్తేమీ లేదుగా..

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:32 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరు మీదకు బదిలీ చేసిన కేసులో మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 
 
అయితే ఆ తీర్పును సమీక్షించాలంటూ మాల్యా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 27న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. సోమవారం ఈ తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
 
తమ తీర్పుపై పునఃసమీక్ష చేయడానికి మాల్యా వేసిన పిటిషన్‌లో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2017 మే 9న విజయ్ మాల్యాను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ మాల్యా మరోసారి కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments