Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా తగ్గిన పసిడి - వెండి ధరలు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:05 IST)
దేశంలో పసిడి ప్రియులకు ఏమాత్రం కొదవలేదు. దీంతో దీనికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎక్కడలేని ఆనందం. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
 
హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ప్రకారం చూసుకుంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.760 త‌గ్గి 43,840కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.830 త‌గ్గి రూ.47,830కి చేరింది. బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1500 త‌గ్గి 70,200కి చేరింది. 
 
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలను పరిశీలిస్తే, 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,170 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,430గా ఉంది.
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,690గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.
 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,830 ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments