Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిస్టింగ్‌కు ఎల్‌ఐసీ-నష్టాల్లో ట్రేడ్ అవుతున్న షేర్లు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (12:22 IST)
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రేమార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించిన మాదిరిగానే జరిగింది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్‌కు రావడం ఇప్పుడు పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ఐపీవో ద్వారా ఎల్‌ఐసీ మార్కెట్ నుంచి 2060 కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించింది.
 
తొలిరోజు షేర్లు ఆఫ‌ర్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర వ‌ద్ద ట్రేడ్ అవ్వడంతో ఇన్వెస్ట‌ర్లు తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. ఎన్ఎస్‌ఈలో ఎల్ఐసీ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే.. 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. దాంతో ఒకలాట్‌ (15 షేర్లు)కు రూ.14,235 పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్ట‌ర్లకు రూ.1,155 లిస్టింగ్‌ లాస్‌ మీద పడింది.
 
అలానే బీఎస్ఈలో ఎల్ఐసీ ఐపీఓ షేరు ఇష్యూ ధర కంటే 8.62 శాతం త‌క్కువ‌గా.. రూ. 867 రూపాయ‌ల వ‌ద్ద ట్రేడింగ్ ప్రారంభం అయింది. మంగ‌ళ‌వారం (మే 17) ఉద‌యం 10.15 గంట‌ల స‌మ‌యంలో బీఎస్ఈలో ఈ షేరు 899.50 రూపాయ‌ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. 
 
స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నా.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఎల్ఐసీ షేర్లు మాత్రం న‌ష్టాల్లో ట్రేడ్ అవ‌టం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments