Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఈ డెబిట్ - క్రెడిట్ కార్డుల లావాదేవీలు రద్దు... ఎందుకంటే...

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (17:19 IST)
భారత రిజర్వు బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టే దిశగా మరో అడుగు వేసింది. డెబిట్ - క్రెడిట్ కలిగి.. ఒక్కసారిగా లావాదేవీ (ట్రాన్సాక్షన్) నిర్వహించని కార్డుల సేవలను రద్దు నిలిపివేయనుంది. అలాగే, ఖాతాదారుల వద్ద ఉండే డెబిట్‌, క్రెడిట్ కార్డులను మరింత సుక్షితంగా మార్చనుంది. 
 
ఈ నిబంధన సోమవారం అంటే మార్చి 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. కార్డులను అనుచితంగా వాడటాన్ని, బ్యాంకింగ్‌ మోసాలను అరికట్టేందుకు అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే ఈ నిబంధనలతో ఆదేశాలు జారీచేసింది. ఇందులోభాగంగా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీ జరపని కార్డులు, కాంటాక్ట్‌ లెస్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డులతో సోమవారం నుంచి ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేసేందుకు వీలుండదు. 
 
ఇలాంటి కార్డులతో ఇకపై కేవలం స్వదేశీ లావాదేవీలు మాత్రమే జరుపుకునే వీలుంటుంది. అంటే  ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పాయింట్ ఆఫ్ సేల్స్‌ (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే కార్డులను వాడుకోవచ్చు. మునుపటి మాదిరిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే మాత్రం ఖాతాదారులు తమ బ్యాంకుల నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. 
 
ఈ సమాచారాన్ని అన్ని బ్యాంకులు ఇప్పటికే సంక్షిప్త సందేశాల రూపంలో తమ ఖాతాదారులకు చేరవేశాయి. ఎస్ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌లతో పాటు ఇంటర్నెట్  ద్వారా అనుమతి తీసుకునేందుకు బ్యాంకులు అనుమతి ఇచ్చాయి. ఇటీవలికాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు బ్యాంకులతో పాటు.. అర్బీఐ వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, విద్యావంతులతో పాటు.. చదువురాని వారుకూడా హ్యాకర్ల చేతిలో మోసపోతున్నారు. దీంతో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments