Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరిపోయే లుక్‌లో టాటా సఫారీ- 3 రంగులు.. 6 వేరియంట్లు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (09:11 IST)
టాటా సంస్థ కొత్త లుక్‌తో టాటా సఫారీని భారతీయ మార్కెట్‌లోకి సోమవారం విడుదల చేయనుంది. గ‌త నెల‌లో ఈ వెహికిల్‌ను ఆవిష్క‌రించిన సంస్థ‌.. ఈ నెల ప్రారంభం నుంచి రూ.30 వేల‌కు బుకింగ్స్ కూడా స్వీకరిస్తోంది. ఈ వాహనాన్ని లాంచ్ చేసిన వెంట‌నే దీని ధ‌ర‌ను కూడా ప్ర‌క‌టించ‌నున్నారు. 
 
ఈ ఎస్‌యూవీ ధ‌ర ఎంత అన్న‌దానిపై కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే దీని ప్రారంభ ధ‌ర‌నే రూ.18 ల‌క్ష‌లు (ఎక్స్-షోరూమ్‌)గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఎంజీ హెక్టార్ ప్ల‌స్‌, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 500, జీప్ కంపాస్‌ల‌తో స‌ఫారీ పోటీ ప‌డ‌నుంది. 
 
కాగా, ఈ కొత్త స‌ఫారీ మొత్తం మూడు రంగుల్లో 9 వేరియంట్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. ఇందులో ఎక్స్ఈ అనేది బేస్ వేరియంట్‌. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు, అన్ని డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇక ఆ త‌ర్వాతి వేరియంట్ అయిన ఎక్స్ఎంలో మ‌ల్టీ డ్రైవ్ మోడ్‌లు, టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్ట‌మ్ ఉంటాయి. 
 
ఇక త‌ర్వాతి ఎక్స్‌టీ మోడ‌ల్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తోపాటు ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ ఉండ‌నున్నాయి. టాప్ మోడ‌ల్ అయిన ఎక్స్‌జెడ్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎల‌క్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్‌, 8.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ట‌చ్‌స్క్రీన్‌, 9 జేబీఎల్ స్పీక‌ర్లు, స‌బ్‌వూఫ‌ర్‌, జినాన్ హెచ్ఐడీ ప్రొజెక్ట‌ర్ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments