Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా మోటార్స్ నాలుగు చక్రాల మినీ-ట్రక్ ఏస్ ప్రో ధర రూ 3.99 లక్షల నుండి ప్రారంభం

ఐవీఆర్
గురువారం, 10 జులై 2025 (19:59 IST)
హైదరాబాద్: భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్ సరికొత్త టాటా ఏస్ ప్రోను ప్రారంభించడం ద్వారా కార్గో మొబిలిటీలో కొత్త మైలురాయిని సృష్టిస్తూ, చిన్న కార్గో మొబిలిటీలో పరివర్తన యుగానికి నాంది పలికింది. కేవలం Rs. 3.99 లక్షల సాటిలేని ప్రారంభ ధరతో, టాటా ఏస్ ప్రో భారతదేశంలో అత్యంత సరసమైన నాలుగు చక్రాల మినీ ట్రక్. ఇది అసాధారణ సామర్థ్యం, సాటిలేని బహుముఖ ప్రజ్ఞ, ఉన్నతమైన విలువను అందిస్తుంది.
 
కొత్త తరం వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి రూపొందించబడిన టాటా ఏస్ ప్రో పెట్రోల్, రెండు రకాల ఇంధనం(CNG+ పెట్రోల్), ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది వినియోగదారులకు వారి వ్యాపార అవసరాలకు అనువైన ఉత్పాదనను ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది.
 
దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ 1250 వాణిజ్య వాహనాల అమ్మకాల టచ్‌పాయింట్లలో లేదా టాటా మోటార్స్ ఆన్‌లైన్ అమ్మ కాల ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లీట్ వెర్స్‌లో కస్టమర్లు తమకు నచ్చిన ఏస్ ప్రో వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు. టాటా ఏస్ ప్రో యాజ మాన్యాన్ని సౌకర్యవంతంగా చేయడానికి, టాటా మోటార్స్ ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలతో కలిసి పనిచేసి, త్వరిత రుణ ఆమోదాలు, సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, మెరుగైన నిధుల మద్దతుతో సహా విభిన్న కస్టమర్ అవసరాలకు అనుగుణం గా తిరుగులేని ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తోంది.
 
ఏస్ ప్రోను ప్రారంభిస్తూ, టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్ మాట్లాడుతూ, ‘‘టాటా ఏస్ ప్రారంభం భారతదేశంలో కార్గో మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చింది. పురోగతి, అవకాశాల చిహ్నంగా ఇది గత రెండు దశాబ్దాలుగా25 లక్షలకు పైగా వ్యవస్థాపకులను విజయవంతంగా శక్తివంతం చేసింది. కొత్త తరం కలలు కనేవారి కోసం సరికొత్త టాటా ఏస్ ప్రోతో మేం ఈ వారస త్వాన్ని నిర్మిస్తున్నాం. సుస్థిరత్వం, భద్రత, లాభదాయకత కోసం రూపొందించబడిన ఏస్ ప్రో, వారి భవిష్యత్తును చూసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఔత్సాహిక వ్యవస్థాపకుల ఆశయాలను నెరవేర్చడానికి ఎక్కువ సంపాదన సామర్థ్యాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.
 
టాటా ఏస్ ప్రో గురించి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్&బిజినెస్ హెడ్- SCVPU శ్రీ పినాకి హల్దార్ మాట్లాడుతూ, "ఉద్దేశపూర్వకమైన టాటా ఏస్ ప్రోను కస్టమర్ల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. విభిన్న శ్రేణి అవసరాలను తీర్చడానికి రూపొందించారు. ఇది లక్షల కిలోమీటర్లు విస్తరించిన వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో కఠినమైన పరీక్షలకు గురైంది. బహుళ-ఇంధన ఎంపికలు, అందుబాటు ధర, మెరుగైన డ్రైవింగ్ సామర్థ్యంతో, టాటా ఏస్ ప్రో విభిన్న వినియోగ సందర్భాలలో అత్యుత్తమ విలువను అందిస్తుంది. విశ్వసనీయమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మొబిలిటీ పరిష్కారాలతో వ్యవస్థాపకులు, చిన్న వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడంలో టాటా మోటార్స్ యొక్క నిబద్ధతను బలోపేతం చేసేందుకు మా పోర్ట్‌ఫోలియోకు ఇది ఒక వ్యూహాత్మక జోడింపుగా ఉంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉత్తర, దక్షిణ బెల్ట్‌లలో బలమైన వ్యవసాయ-పారిశ్రామిక కార్యకలాపాలతో హైదరాబాద్ సాంకేతికత ఆధారిత వృద్ధిని కలుపుతుంది. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల, ముఖ్యంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డిలో, అభివృద్ధి చెందుతున్న ఆహార-ప్రాసెసింగ్ జోన్‌లు, నివాస స్థలాలు, ఇ-కామర్స్ గిడ్డంగులు అనేవి కిరాణా, బేకరీ వస్తువులు, పార్శిళ్ల రోజువారీ కదలికకు ఇంధనంగా నిలుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments