Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబెర్ ఈట్స్‌పై కన్నేసిన స్విగ్వీ

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (14:59 IST)
రైడింగ్ సేవలు అందించే ఉబెర్... ఉబెర్ ఈట్స్ పేరిట ఫుడ్ డెలివరీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తోంది. ఇప్పుడు ఉబెర్ ఈట్స్ ఇండియాను స్విగ్గీ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే స్విగ్గీ అతిపెద్ద ఫుడ్-టెక్ కంపెనీగా ఎదగడం ఖాయమనే చెప్పవచ్చు. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన పక్షంలో స్విగ్గీలో ఉబెర్‌కు 10 శాతం వాటా లభిస్తుంది. ఆ వాటా విలువ 3.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.
 
భారతీయ ఫుడ్-టెక్ కంపెనీ అయిన స్విగ్గీ ఇటీవలే 1 బిలియన్ డాలర్ల ఫండింగ్ పొందడం విశేషం. జొమాటో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న స్విగ్గీ... గత ఏడాది అక్టోబర్‌లో జొమాటో ఆలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ నుంచి 210 మిలియన్ డాలర్ల నిధుల్ని సేకరించింది. 
 
జొమాటో, స్విగ్గీల మధ్య ఫుడ్ టెక్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉండడంతో మరో పోటీ కంపెనీ అయిన ఉబెర్ ఈట్స్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచేందుకు స్వీగ్గీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు ఉబెర్ నష్టాలను తగ్గించుకునే వ్యూహంలో ఉబెర్ ఈట్స్ ఇండియాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments