Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (11:48 IST)
భారత రైల్వే శాఖ మరోసారి రైల్వే ప్రేమికులందరికీ అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఎంతోమంది తమ స్వగ్రామాలకు పండగకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి పోతూ ఉంటుంది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు.. పెరిగే ప్రయాణికుల రద్దీకి సరిపడే అవకాశం తక్కువగానే ఉంది అందుకే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులందరికీ శుభవార్త చెప్పింది. దసరా దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. 
 
కొత్తగా దేశవ్యాప్తంగా ఏకంగా 200 ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు అందరికీ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 17 రైళ్లను పట్టాలెక్కించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ నర్సాపూర్ విశాఖ చెన్నై బెంగళూరు తిరువనంతపురంకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికుల అందరికీ ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments