Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా కుర్తా పట్టుకుని లాగిన పోలీస్... తీవ్రంగా పరిగణిస్తూ సారీ చెప్పిన ఉన్నతాధికారులు!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (11:02 IST)
కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసుల్ అమర్యాదగా ప్రవర్తించారు. ఆమె కుర్తా పట్టుకుని లాగేందుకు ఓ పోలీస్ ప్రయత్నించాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన యూపీ పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తూ, ప్రియాంకా గాంధీకి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారితో దర్యాప్తు జరిపించనున్నట్టు చెప్పారు. మహిళల భద్రత, వారి గౌరవానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
 
హత్రాస్ హత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తాజాగా తన అన్న రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంకా గాంధీ ఈ నెల 3వ తేదీ బయలుదేరారు. ఈ క్రమంలో నోయిడా ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల బారి నుంచి కార్యకర్తలను రక్షించేందుకు ప్రియాంక పరుగున ముందుకు వెళ్లారు. దీనిని గమనించిన ఓ పోలీసు ప్రియాంక కుర్తా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రియాంక కింద పడబోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.
 
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ప్రియాంకపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారితో దర్యాప్తు జరిపించనున్నట్టు చెప్పారు. మహిళల భద్రత, వారి గౌరవానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments