Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌‌లో డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌‌ను పరిచయం చేసిన సిద్స్‌ ఫార్మ్‌

Webdunia
బుధవారం, 4 మే 2022 (20:32 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహి స్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ తమ ఉత్పత్తి ఫోర్ట్‌ఫోలియోను  మరింతగా విస్తరిస్తూ డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ముందు హైదరాబాద్‌లో విడుదల చేసిన అనంతరం మిగిలిన నగరాలకు విస్తరించనున్నారు. ఈ డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో 500 మిల్లీ లీటర్‌ మిల్క్‌ ధర 40 రూపాయలు. కేలరీల పట్ల అమిత శ్రద్ధ చూపడంతో పాటుగా డైటరీ నిబంధనలు అనుసరించే వారిని లక్ష్యంగా చేసుకుని దీనిని విడుదల చేశారు.

 
సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులు ఎంతోకాలంగా మా గేదె పాలను అమితంగా అభిమానిస్తున్నారు. ఈ పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. వారు తమ రోజువారీ వినియోగం కోసం అతి తక్కువ కొవ్వు కలిగిన పాలను కోరుకుంటున్నారు. వారి కోరికకునుగుణంగా ఈ పాలను విడుదల చేస్తున్నాం. త్వరలో మేము విడుదల చేయబోయే ఎన్నో ఉత్పత్తి ఆవిష్కరణలలో ఇది మొదటిది’’ అని అన్నారు.

 
ఈ డబుల్‌ టోన్డ్‌ బఫెలో మిల్క్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కానీ స్వచ్ఛమైన గేదె పాల చక్కదనం మాత్రం ఉంటుంది. అత్యధిక పోషక విలువలు కలిగి ఉండేలా ఈ పాలను సమృద్ధి చేశారు. షాప్స్‌, ఫిజికల్‌ ఔట్‌లెట్లతో పాటుగా డబుల్‌ టోన్డ్‌ ఏ2 బఫెలో మిల్క్‌ ఇప్పుడు సిద్స్‌ ఫార్మ్‌ యాప్‌ పైన కూడా హోమ్‌ డెలివరీకి అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments