ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి కొత్త వివాదానికి తెరలేపారు. ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఆయన ఉద్యమం లేవదీశారు. కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్, విశాఖల్లో జరుగుతున్నాయి.
ఇది ఫెప్సీ పేరుతో ఓ సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్కే సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండటం లేదని సెల్వమణి వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగ్‌లు చేయడానికి.. పనికిరామా అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి దర్శకుడు అయిన సెల్వమణికి షూటింగ్ లొకేషన్లు ఎలా సెలక్ట్ చేసుకుంటారో తెలుసు. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు. కానీ లేనిపోని వివాదం రేపి.. తెలుగురాష్ట్రాల్లో షూటింగ్‌లు వద్దని రచ్చ చేస్తున్నారు.
అంతేగాకుండా తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదని అగ్రహీరోలందరూ హైదరాబాద్ , విశాఖల్లో షూటింగ్‌లు చేస్తున్నారని ఆయన అంటున్నారు.
ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించారని.. తమిళ సినిమాల షూటింగ్‌లు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. అజిత్ ఇంకా స్పందించాల్సి ఉందంటున్నారు.