Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో వ్యాపారులకు శుభవారం.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (09:22 IST)
తమిళనాడు రాష్ట్రంలో వ్యాపారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు 24 గంటల పాటు వ్యాపారం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆ సర్కారు ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. అయితే, మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ బాధ్యతను కల్పించాలని స్పష్టంచేసింది. రాత్రిపూట తెరిచివుంచే వ్యాపార సంస్థలు, మాల్స్‌లలో పని చేసే ఉద్యోగుల పేర్లు అందరికీ తెలిసివుంచేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన చేసింది. నైట్ షిఫ్టుల్లో పని చేసే మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కూడా కల్పించాలని ఆ గెజిట్‌లో పేర్కొంది.
 
అదేసమయంలో ఉద్యోగుల కోసం విశ్రాంతి గదులు, వాష్‌రూములు, సేఫ్టీ లాకర్లతోపాటు కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని కూడా పేర్కొంది. ఉద్యోగులతో 8 గంటలకు మించి పనిచేయించరాదని, వారంలో 48 గంటలు దాటరాదని స్పష్టంగా పేర్కొంది. ఓవర్ టైమ్ కూడా రోజులే 10.5 గంటలు దాటరాదని ప్రభుత్వం పేర్కొంది. వారంలో 24 గంటలు పని చేసే ఈ వెసులుబాటును తొలుత మూడేళ్ళకు మాత్రమే అనుమతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments