Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకుపోతున్న ZOMATO: 50 శాతం పైగా లాభంతో షేర్‌ లిస్ట్

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (16:20 IST)
షేర్‌ మార్కెట్‌లోకి ఎంట్రీతోనే భారీ లాభాలతో అడుగుపెట్టింది ఫుడ్ డెలివర్ కంపెనీ జొమోటో. జులై 14 నుంచి16 మధ్య పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఆఫర్ చేసిన జొమోటో ఇష్యూ ధర కంటే 50 శాతం పైగా లాభంతో షేర్‌ ధర లిస్ట్ అయ్యింది. షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ షేర్లు ఆఫర్ చేసిన ధర రూ.76 కాగా, ఇవాళ ఉదయం 10 గంటలకు షేర్ మార్కెట్ ఓపెన్‌ కాగానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో రూ.116తో లిస్ట్ కావడం విశేషం. 
 
షేర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఒక్కసారిగా 53 శాతం లాభం వచ్చినట్టయింది. నిమిషాల గ్యాప్‌లోనే 10.05 గంటలకు ఏకంగా రూ.135.60కి చేరింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్‌ఈ)లో రూ.115తో లిస్ట్ అయింది. అంటే బీఎస్‌ఈలో 51 శాతం ప్రీమింయం రేట్‌తో షేర్ ఓపెన్ అయింది. ఇక ఉదయం 10.05 గంటలకు రూ.134.70కు చేరింది. 
 
వాస్తవానికి ఈ నెల 27న లిస్ట్ అవ్వాల్సిన జొమోటో ముందుగానే ఎంట్రీ ఇచ్చి, షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నెల 14న పబ్లిక్ ఇష్యూకు ఓపెన్ అయిన జొమోటో రూ.9,375 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఏకంగా 38 రెట్లు ఎక్కువగా కస్టమర్లు సబ్‌స్క్రైబ్‌ చేశారు. రూ.5 వేల కోట్ల కంటే అధికంగా ఉన్న షేర్లలో ఇది గడిచిన 13 ఏండ్లలోనే ఒక రికార్డ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments