Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ సీజన్‌లో భారీగా బంగారం దిగుమతి

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (20:42 IST)
దేశంలో పండగ సీజన్ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మ‌హిళ‌లు ఆభ‌ర‌ణాలు, బంగారం కొనుగోళ్ల‌కు ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడిప్పుడే క‌రోనా ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌రులో బంగారం దిగుమ‌తులు భారీగా పెరిగాయి. గ‌తేడాదితో పోలిస్తే గ‌త నెల‌లో 658 శాతం దిగుమ‌తులు పెరిగాయి. 2020 ఆగ‌స్టులో ఔన్స్ బంగారం ధ‌ర 2072 డాల‌ర్ల‌కు పెరిగి ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పింది. 
 
ప్ర‌స్తుతం 15 శాతం త‌గ్గింది. అయితే, బంగారం దిగుమ‌తులు పెర‌గ‌డంతో దేశీయ వాణిజ్య లోటు పెరిగిపోయింది. ఫ‌లితంగా రూపాయికి డార‌ల్‌కు మ‌ధ్య అంత‌రం పెరిగింది. 
 
గ‌తేడాదితో పోలిస్తే గ‌త నెల‌లో బంగారం దిగుమ‌తులు 91 ట‌న్నులు పెరిగాయి. గ‌తేడాది క‌వేలం 12 ట‌న్నులు మాత్ర‌మే విలువప‌రంగా గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో దిగుమ‌తైన బంగారం విలువ 601 మిలియ‌న్ల డాల‌ర్లు అయితే, ఈ ఏడాది 5.1 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు పెరిగాయి. 
 
సెప్టెంబ‌రుతో ముగిసిన త్రైమాసికంలో బంగారం దిగుమ‌తులు 170 శాతం పెరిగి 288 ట‌న్నుల‌కు చేరాయి. లోక‌ల్ గోల్డ్ ఫ్యూచ‌ర్స్ 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,479 (611.93 డాల‌ర్లు)కు ప‌డిపోయింది. బంగారం కొనుగోళ్ల‌కు రిటైల్ డిమాండ్ పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments