Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు.. మరోమారు రూ.లక్ష కోట్లు క్రాస్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (08:27 IST)
దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాయ. వరుసగా రెండో నెలలో కూడా లక్ష కోట్ల రూపాయలు క్రాస్ అయ్యాయి. ఆగస్టు నెలలో మొత్తం 1.12 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
జులై నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకుపైగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ మొత్తం 86,449 కోట్ల రూపాయలుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 30 శాతం పెరిగాయి. 
 
ఇక ఈ ఏడాది వసూలైన రూ.1,12,020 కోట్లలో కేంద్ర జీఎస్టీ రూ.20,522 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.26,605 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
అయితే, జులైతో పోలిస్తే ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా తగ్గాయని పేర్కొంది. జులై నెలలో రూ.1.16 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైన సంగతి తెలిసిందే. ఆగస్టులో ఇది రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే. 
 
గత అక్టోబరు నుంచి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల పైగానే ఉంటూ వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో ఈ వసూళ్లు రూ. 92,849 కోట్లకు పడిపోయాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments