సైబర్ నేరాలకు చెక్ : ఇక ఈ నంబర్ల కాల్స్ వస్తే... అవి ఎస్‌.బి.ఐ కాల్సే...

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (19:49 IST)
సైబర్ నేరాలకు చెక్ పెడుతూ ఎంపిక చేసిన నంబర్ల నుంచే కాల్స్ చేస్తామంటూ ఎస్.బి.ఐ వెల్లడించింది. బ్యాంకు సంబంధి లావదేవీలు, సేవలకు సంబంధించి ఇకపై +91-1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే కాల్స్ చేయనున్నట్టు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో మోసాల పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నట్టు వేళ ఏయే నంబర్ల నుంచి కాల్స్ చేయబోయేది ఎస్.బి.ఐ తన్‌ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. 
 
కస్టమర్లకు 1600 సిరీస్‌తో మొదలయ్యే నంబర్ నుంచి కాల్ చేయాలంటూ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్.బి.ఐ ఈ యేడాది జనవరిలో సూచించింది. ఒక వేళ మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ కోసమైతే 1400 సిరిస్‌ను వినియోగించాలని తెలిపింది. దీనివల్ల ఏది నమ్మదగినది. ఏది మోసపూరిత ఫోన్ కాల్‌ తెలుసుకోవడానికి సాధ్యమవుతుందని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో ఎస్.బి.ఐ ఆయా నంబర్ల వివరాలు పొందుపరిచింది. +91-1600తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి మీకు కాల్ వస్తే అది నిజమైన, చట్టబద్ధమైన కాల్ అని నిర్ధారించుకోండి. లావాదేవి, సేవలకు సంబంధిత కాల్స్ కోసం మాత్రమే వీటిని వినియోగిస్తాం. స్పామ్, మోసపూరిత కాల్స్ నుంచి వీటిని వేరు చేయడంలో ఈ నంబర్ల ఉపయోగపడతాయి అని ఎస్.బి.ఐ అడ్వైజరీలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments