Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవింగ్ ఖాతాలపై స్టేట్ బ్యాంకు బాదుడే బాదుడు...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:25 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ భారం మోపేందుకు శ్రీకారం చుట్టనుంది. 
 
ఎస్పీఐ బ్యాంకుల్లో ఉండే బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాల ఛార్జీలను జూలై 1 నుంచి ఎస్‌బీఐ సవరిస్తుంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్‌) సదుపాయాన్ని నెలకు గరిష్టంగా నాలుగుకు మాత్రమే పరిమితం చేస్తోంది. 
 
ఆ పరిమితి మించితే ప్రతి నగదు ఉపసంహరణపైనా రూ.15 ప్లస్‌ జీఎస్‌టీని కలిపి వసూలు చేయనుంది. బ్యాంక్‌ శాఖలు, ఏటీఎంలు, ఇరత బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే అన్ని అదనపు నగదు విత్‌డ్రాయల్స్‌కూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.  
 
అదేవిధంగా ఇకపై పరిమితికి మించి చెక్కులు కావాలన్నా కూడా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రస్తుతం బీఎస్‌బీడీ ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీఫ్స్‌ ఉండే ఒక చెక్‌బుక్‌‌ను ఎస్‌బీఐ ఉచితంగా జారీ చేస్తోంది. 
 
జూలై 1 నుంచి ఆ పరిమితి మించితే 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.40 ప్లస్‌ జీఎస్టీ, 25 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.75 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అత్యవసరంగా 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌ కావాలన్నా బీఎస్‌బీడీ ఖాతాదారులు రూ.50 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అయితే సీనియర్‌ సిటిజన్లను ఈ అదనపు చెక్‌బుక్‌ చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments