Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఖాతాదారులకు షాకిచ్చే వార్త.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (20:54 IST)
ఎస్బీఐ ఖాతాదారులకు షాకిచ్చే వార్త. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది ఎస్బిఐ. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 
 
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
 
ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 
 
జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments