రామ్‌గోపాల్ వర్మ కరోనా టైంలో వ్యాయామం చేస్తూ కండలు చూపిస్తూ నిన్ననే పోస్ట్ చేశాడు. దీనికి పలువురు రకరకాలుగా స్పందించారు. కానీ నటి అప్సర రాణి దృష్టి వర్మపై పడింది. రామును ప్రశంసిస్తూ, "సర్ జి తుస్సీ బాహుత్ స్ట్రాంగ్ హో (సార్ మీరు చాలా బలంగా ఉన్నారు), నేను నిజంగా మంచి కండరపుష్టి అరి చెప్పాలి మీరు నిజమైన ప్రేరణ అంటూ పేర్కొంది. మరి వర్మ ఊరుకుంటాడా! తనూ బాగానే రియాక్ట్ అయ్యాడు.
అప్సర రాణి శరీరంపై వ్యాఖ్యానిస్తూ, "ధన్యవాదాలు, కానీ నా కండరపుష్టి బాగుంది అని మర్చిపో, నీ శరీరంలోని ప్రతి చదరపు అంగుళాన్ని మీరు బహిర్గతం చేశారని చెప్పాలి. నీ శరీరంలోని ప్రతి భాగం అద్భుతమైనది. మీ భాగాలు కనిపించకుండా ఎంత ఫెంటాస్టిక్‌గా బట్టలు కప్పాను అని బదులిచ్చారు.
అయితే ఆమె అందాలను మరింత తేటతెల్లం చేస్తూ వర్మ తన స్పార్క్ ఓటీటీలో మొదటి సినిమాగా `డేంజరస్` విడుదల చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మొట్టమొదటి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ చిత్రం డేంజరస్. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో ఉన్నారు.
కథగా చెప్పాలంటే,
డేంజరస్ అనేది అప్సర రాణ, నైనా గంగూలీ అనే ఇద్దరు మహిళల మధ్య చీకటి కోణం ఉద్వేగభరితమైన అధిక తీవ్రత కలిగిన లెస్బియన్ ప్రేమ కథ. ఇందులో ఇతర పాత్రలు ఏమైనా వున్నాయనేది కూడా ఆయన తెలియపర్చలేదు. కరోనా సెకండ్‌వేవ్ లేకపోతో ఈ సినిమాను జులై 12న విడుదల చేయాలనే ప్లాన్ వేసుకున్నారు. సాధ్యపడకపోవడంతో ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. అసలు ఓటీటీ పెట్టిందే ఇలాంటి సినిమాలు విడుదల చేయడానికి అన్నట్లు తెలుస్తోంది.
మరి వర్మ ఓటీటీ పెట్టాడని తెలియగానే సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వారంతా ఇలాంటి సినిమాలు విడుదలచేసి సభ్యసమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నారంటూ ఆ ప్రముఖులే చెప్పాలని సినీ విశ్లేషకులు కోరుతున్నారు.