Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 489 పోస్టుల కోసం..

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:33 IST)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎస్సీవో) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. 
 
ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాల్సి వుంటుంది. 
 
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11
కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి 22
రాతపరీక్ష- 2021 ఫిబ్రవరి 1
 
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments