Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎంజీసీలో వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టిన సాజెన్‌

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (22:53 IST)
ఇండియా మార్ట్‌గేజ్‌ గ్యారెంటీ కార్పోరేషన్‌ (ఐఎంజీసీ) నేడు తాము సాజెన్‌ ఎంఐ కెనడా(సాజెన్‌)లో దాదాపు 31% వాటాను ప్రైమరీ ఫండింగ్‌ రౌండ్‌లో పొందినట్లు వెల్లడించింది. ఈ ప్రతిపాదిత లావాదేవీ చట్టబద్ధమైన, రెగ్యులేటరీ అనుమతులు అందుకున్న తరువాత ముగుస్తుంది.

 
ఈ పెట్టుబడులతో ఐఎంజీసీలో మరో మార్క్యూ పెట్టుబడిదారుడు చేరినట్లయింది. దీనిలో ప్రస్తుతం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, ఇంటర్నేషనల్‌  ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఎనాక్ట్‌ హోల్డింగ్స్‌ ఇంక్‌లు వాటాదారులుగా ఉన్నారు.

 
ఇది భారతదేశంలో సాజెన్‌ యొక్క మొట్టమొదటి పెట్టుబడి. సాజెన్‌ దాదాపుగా 27 సంవత్సరాలుగా కెనడాలో  కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అక్కడ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ రెసిడెన్షియల్‌ మార్టిగేజ్‌ డిఫాల్ట్‌ ఇన్సూరర్‌గా నిలిచింది. సాజెన్‌ సీఈఓ మరియు అధ్యక్షుడు స్టూవార్ట్‌ లెవింగ్స్‌ మాట్లాడుతూ, ‘‘ఐఎంజీసీలో ఈ పెట్టుబడులు పెట్టడం పట్ల సంతోషంగా ఉన్నాం మరియు ఐఎంజీసీ వృద్ధికి మద్దతునందించనున్నాం’’ అని అన్నారు.

 
ఐఎంజీసీ సీఈఓ మహేష్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘‘మా తరువాత దశ వృద్ధిలో వ్యూహాత్మక పెట్టుబడిదారునిగా సాజెన్‌‌ను స్వాగతిస్తున్నాం. సాజెన్‌ యొక్క అంతర్జాతీయ అనుభవంతో భారతదేశంలో మార్టిగేజ్‌ గ్యారెంటీ మార్కెట్‌లో ఆవిష్కరణ  మరియు పరివర్తనను చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర అద్భుతమైన విజయం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 ప్రారంభం

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments