Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశపు మొట్టమొదటి కార్బన్‌ ఆఫ్‌సెట్‌ ఎన్‌ఎఫ్‌టీని విడుదల చేసిన టీఆర్‌ఎస్‌టీ01

Mango
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (23:01 IST)
బ్లాక్‌చైన్‌ పరిష్కారాలను అందించడంలో అగ్రగామి సంస్థలలో ఒకటైన టీఆర్‌ఎస్‌టీ01 (త్రయంభు టెక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) ఇప్పుడు కార్బన్‌ ఆఫ్‌సెట్‌ ఎన్‌ఎఫ్‌టీ టొకెన్‌ భూ (సంస్కృతంలో భూ అంటే భూమి అని అర్థం) విడుదల చేసింది.
 
ధరిత్రీ దినోత్సవం పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌టీ01 , భూ ఎన్‌ఎఫ్‌టీని లిస్ట్‌ చేసింది. భారతదేశంలో దీనిని తయారుచేశారు. ఇది ఓపెన్‌ సీ మార్కెట్‌ ప్లేస్‌లో భారతదేశపు  మొట్టమొదటి రియల్‌ వరల్డ్‌ కార్బన్‌ నాన్‌ ఫంగిబల్‌ టోకెన్‌.

 
కార్బన్‌ ఆఫ్‌సెట్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఉన్న 4-5బిలియన్‌ డాలర్ల నుంచి 2030 నాటికి 400-650 బిలియన్‌ డాలర్లుగా మారుతుందని అంచనా. పాలీగన్‌ బ్లాక్‌చైన్‌ ఆధారంగా, భూ ఎన్‌ఎఫ్‌టీ ఇప్పుడు కార్బన్‌ ఆఫ్‌సెట్‌ వ్యాపారంలో సమస్యలను బ్లాక్‌చైన్‌ సాంకేతికత వినియోగించడం ద్వారా పరిష్కరిస్తుంది.

 
ఈ సందర్భంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శ్రీకాంత కె పాణిగ్రాహి మాట్లాడుతూ ‘‘ప్రకృతికి తనంతట తానుగా తిరిగి పొందే శక్తి ఉంది. అయితే ప్రకృతి  సంపదను విచ్చలవిడిగా వాడుతుండటం వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే 1.2 డిగ్రీలు అధికమవుతున్నాయి. మన జీవవైవిధ్యత పరంగా 30%కు పైగా నష్టపోయాం. ఇప్పుడు టీఆర్‌ఎస్‌టీ 01 జీరో ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తమ మొదటి కార్బప్‌ బ్రోకన్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

 
తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ, కార్బన్‌ క్రెడిట్‌ ఎన్‌ఎఫ్‌టీ కోసం విప్లవాత్మక ఆలోచనతో టీఆర్‌ఎస్‌టీ01టీమ్‌ రావడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో వెబ్‌ 3.0 వ్యవస్థను ప్రోత్సహించేందుకు  తగిన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌టీ01 కో-ఫౌండర్‌ అండ్‌ సీఈవో ప్రబిర్‌ మిశ్రా మాట్లాడుతూ ‘‘వేగవంతంగా కార్బన్‌ న్యూట్రాలిటీ దిశగా ప్రపంచం పయణిస్తోంది. ఇక్కడ సరఫరా, డిమాండ్‌ నడుమ అంతరం ఉంది. 2025 నాటికి ఇది భారీగా ఉండనుంది’’ అని అన్నారు.

కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పీజెటీఎస్‌ఏయు వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ రావు  పాల్గొనగా, డాక్టర్‌ కల్పనా శాస్త్రి, ఎండీ-ఏజీహబ్‌ ; డాక్టర్‌ అలోక్‌ రాజ్‌, సీఓఓ-సీఓఈ, కిశోర్‌ భుటానీ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతి తేలికైన స్మార్ట్‌ఫోన్‌ మోటో జి52ని లాంచ్‌ చేసిన మోటోరోలా