Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2000 నోటులో నానో టెక్నాల‌జీ చిప్ అమ‌ర్చారా?

న్యూఢిల్లీ: న‌ల్ల ధ‌నాన్నిఅరిక‌ట్ట‌డానికి రూ.500 నోట్లు, రూ.వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రి వాటి స్థానంలో అతి పెద్ద నోటు 2000 రూపాయ‌లు ఎందుకు తెస్తున్న‌ట్లు అనేది చాలా మంది ప్ర‌శ్న‌. కానీ, ఇక దాచినా దాగ‌దు... నోట

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (13:44 IST)
న్యూఢిల్లీ: న‌ల్ల ధ‌నాన్నిఅరిక‌ట్ట‌డానికి రూ.500 నోట్లు, రూ.వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌రి వాటి స్థానంలో అతి పెద్ద నోటు 2000 రూపాయ‌లు ఎందుకు తెస్తున్న‌ట్లు అనేది చాలా మంది ప్ర‌శ్న‌. కానీ, ఇక దాచినా దాగ‌దు... నోటు! 2000 రూపాయ‌ల నోటు చాలా హై సెక్యూరిటీ క‌లిగిన‌ది అని రిజ‌ర్వు బ్యాంకు ఉన్న‌తాధికారులు తెలిపారు. అంటే... దాని ప‌ర‌మార్ధం వేరే ఏదో ఉందని అర్థం. ఈ నోట్లు ఎక్క‌డ ఉన్నా... జిపిఎస్ ద్వారా ఇట్టే క‌నిపెట్టేయ‌చ్చ‌ట‌. కొత్త‌గా విడుదల చేసే ఈ నోట్లో ఎన్.జి.సి. అంటే నానో టెక్నాల‌జీ జీపీఎస్ చిప్‌ని అమర్చార‌ట‌. దీని వలన ఉపగ్రహం నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరెన్సీ నోట్ గ్రహించి, ఆ నోట్ ఎక్క‌డుందో ఇట్టే చెప్పేస్తుంది. దీనికి ఏవిధమైన పవర్, అదనపు పరికరం అవసరం లేదు. 
 
ఉప గ్రహం నుంచి సిగ్నల్ అందగానే, మరల ఈ నోట్ తిరిగి సిగ్నల్ పంపిస్తుంది. ఈ విధంగా ఈ నోట్లు ఎక్కడ, ఎన్ని, ఎంత మొత్తంలో ఎంత లోతులో ఉన్నాయనేది ఉపగ్రహం పసిగ‌ట్టి ఆ సమాచారాన్నిఇంకంటాక్స్ అధికారులకు చేరవేస్తుంది. ఇక పెద్ద మొత్తంలో సొమ్ము గుట్టుగా దాచుకొనేందుకు వీలుపడదు. ఒకవేళ ఈ నోట్‌ను వేరే విధంగా మన తెలివి తేటలతో చిప్‌ని డియాక్టివేట్ చేయాల‌ని ప్రయత్నిస్తే, ఆ నోట్ ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఈ విధముగా ఎక్కడ ఎక్కువ బ్లాక్ మనీ ఉంటే అక్కడ దాడులు జరిపి బ్లాక్ మనీని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ కొత్త నోట్ ఉద్దేశం. అయితే , ఈ చిప్ గురించి మాత్రం ఆర్.బి.ఐ ఉన్న‌తాధికారులు ధృవీక‌రించ‌డం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments