రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బండి.. లక్కీ డ్రా.. 25 మందికి ఆ ఛాన్స్

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (17:18 IST)
Royal Enfield Shotgun 650
రాయల్ ఎన్ఫీల్డ్ గోవాలో మోటోవర్స్ 2023 అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అయితే ఈ మోడల్‌కు సంబంధించి 25 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 
 
మోటోవర్స్ ఈవెంట్‌లో పాల్గొన్న 25 మందికి ఈ బైక్‌లను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం లక్కీ డ్రాను నిర్వహిస్తారు.
 
ఈ షాట్‌గన్ 650 యొక్క కొత్త ఎడిషన్ క్లాసిక్ బాబర్ డిజైన్‌తో వస్తుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, బార్ ఎండ్ మిర్రర్‌లతో కూడిన వైడ్ హ్యాండిల్ బార్, రైడర్ ఓన్లీ శాడిల్, షార్ట్-వైడ్ రియర్ ఫెండర్, ఆల్-బ్లాక్ హార్డ్‌వేర్ ప్యాకేజీ రాబోతోంది. ఈ బైక్‌కు పూర్తి-LED లైటింగ్ సిస్టమ్, సెమీ డిజిటల్ కన్సోల్, ట్రిప్పర్ నావిగేషన్ మాడ్యూల్ ఉన్నాయి.
 
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ 649cc, ఎయిర్, ఆయిల్ కూల్డ్, ట్విన్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది 47 హెచ్‌పి పవర్, 52 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
 
సూపర్ మీటోర్ 650 బైకులో కూడా ఇదే ఇంజన్ ఉంది. మోడల్ మాదిరిగానే, కొత్త బైక్ కూడా అల్లాయ్ వీల్స్, వెడల్పాటి టైర్లు మరియు ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్‌లతో వస్తుంది.
 
మరియు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.25 లక్షలు. ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కాబట్టి, కంపెనీ దీనికి మంచి డిమాండ్‌ని అంచనా వేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments