Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ విషయంలో జరిగేదే ఏపీలోనూ జరుగుతుందేమో: రోజా

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (10:41 IST)
రాజధానికి, రాజధాని రైతులకు సీఎం జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 
 
కానీ ఒకేచోట అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే హైదరాబాద్ విషయంలో జరిగిందే ఏపీలోనూ జరుగుతుందేమోనన్న ఆలోచనతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా వివరించారు. 
 
ఇప్పటికే వెనుకబడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మళ్లీ ఉద్యమానికి పూనుకుంటే రాష్ట్రంలో సమస్యలు వస్తాయని సీఎం గుర్తించారని తెలిపారు. అందుకే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
 
కొత్త బిల్లు తెచ్చే క్రమంలో రైతులతోనూ, న్యాయస్థానాల్లో కేసులు వేసిన వారితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని రోజా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments