Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఇన్ఫోకామ్‌లోమరో 30 వేల కోట్లు కుమ్మరించనున్న ఆర్ఐఎల్

అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (06:07 IST)
అభివృద్ధి, సిగ్నళ్ల బలోపేతానికి గాను జియో ఇన్ఫోకామ్‌లోక మరో రూ. 30,000 కోట్లను మదుపు చేయనున్నట్లు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇటీవలే తన బోర్డు సమావేశం ఏర్పాటు చేసిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ తన టెలికామ్ యూనిట్‌లోకి భారీ మొత్తంలో మదుపు చేయాలని, దీనికోసం 600 కోట్ల విలువైన ప్రాధాన్యతా షేర్లను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. 
 
ఇప్పటికే ఆర్ఐఎల్ తన టెలికామ్ వెంచర్ జియో ఇన్ఫోకామ్‌లో లక్షా 71 కోట్ల రూపాయలను మదుపు చేసింది. 2016 సెప్టెంబర్ 5న ప్రారంభించిన నాటి నుంచి జియో మొత్తం 7 కోట్ల మంది యూజర్లను సంపాదించింది. సంస్థ ప్రకటించిన ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్ల ద్వారానే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంత తక్కువ కాలంలో ఇంతమంది వినియోగదారులను సంపాదించిన చరిత్ర ప్రపంచంలోనే ఏ కంపెనీకి సాధ్యపడలేదు.
 
అయితే నెట్‌వర్క్ కవరేజ్, కాల్ డ్రాప్‌ల సమస్య కారణంగా కస్టమర్ల విశ్వాసం దెబ్బతింటోందని గమనించిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా మదుపు చేయనున్న 30 వేల కోట్లతో ఈ సమస్యను అధిగమించగలనని విశ్వాసంతో ఉంది. పైగా అతి త్వరలో కేవలం రూ.900 లకే జియో వోల్టే ఫీచర్ ఫోన్లను ప్రారంభిస్తానని కంపెనీ ప్రకటించడం పోటీ సంస్థలను వణికిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments