Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జల్లికట్టు' అలజడి... నటి త్రిష ట్విట్టర్ హ్యాక్.. కమల్ - రజినీ మద్దతు...

తమిళనాడు సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించలేని పరిస్థితి కారణం పెటా సంస్థ. ఈ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను విచార

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (05:48 IST)
తమిళనాడు సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించలేని పరిస్థితి కారణం పెటా సంస్థ. ఈ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జల్లికట్టు పోటీల నిర్వహణపై నిషేధం విధించింది. అయిప్పటికీ.. జల్లికట్టు నిర్వహించాలని పెద్దఎత్తున ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జంతు హక్కుల సంరక్షణ సంస్థ 'పెటా' ప్రచారకర్త, నటి త్రిషపై జల్లికట్టు మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమె తన ట్విట్టర్‌ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జల్లికట్టు పోటీలు నిర్వహించలేక పోవడానికి పెటా సంస్థ కారణమంటూ ఆ సంస్థ ప్రచారకర్తగా ఉన్న త్రిషపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే త్రిష ఖాతాను తాము హ్యాక్ చేయలేదని, ఆమె డీయాక్టివేట్ చేసుకుందని జల్లికట్టు నిర్వాహకులు చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో త్రిషపై వస్తున్న విమర్శలకు నటుడు కమల్ హాసన్ ఘాటుగా స్పందించారు. 'జల్లికట్టు' వ్యవహారంలో త్రిషను గాయపరిచేలా వ్యవహరించడం తగదన్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తమిళ సంస్కృతిలో ఓ భాగమైన జల్లికట్టుపై నిషేధం తగదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments