Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 కల్లా రూ.75 లక్షల కోట్లకు.. అసోచామ్‌

భారత రిటైల్‌ మార్కెట్‌ వచ్చే మూడేళ్లలో అమితంగా ప్రగతి సాధిస్తుందని ఎమ్‌ఆర్‌ఆర్‌ఎస్‌ ఇండియా, అసోచామ్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 కల్లా 1.1 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.75 లక్షల క

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (13:47 IST)
భారత రిటైల్‌ మార్కెట్‌ వచ్చే మూడేళ్లలో అమితంగా ప్రగతి సాధిస్తుందని ఎమ్‌ఆర్‌ఆర్‌ఎస్‌ ఇండియా, అసోచామ్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 కల్లా 1.1 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.75 లక్షల కోట్లు) స్థాయికి చేరగలదని తెలిపింది. 
 
ప్రస్తుతం ఈ మార్కెట్‌ 680 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.46 లక్షల కోట్లు)గా ఉంటే ఇది 75 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. భారత్‌లో రిటైల్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ మార్కెట్లు ఏటా 20 శాతం; 21 శాతం చొప్పున రాణించవచ్చని నివేదికలో అంచనా వేసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ మార్కెట్‌ విషయానికొస్తే 2020 కల్లా ప్రస్తుతమున్న 49 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 103.7 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అభిప్రాయపడింది. 
 
దీనిపై అసోచామ్‌ ప్రతినిధి మాట్లాడారు. ‘భారత్‌లో మెట్రోలు, రాష్ట్ర రాజధానులు, పెద్ద పట్టణాలపై దృష్టి ఉంది. 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇటువంటి పట్టణాలు భారత్‌లో 600కు పైగా ఉన్నాయి. మరో పక్క అధికాదాయం గల గృహస్తులు 30 శాతం వరకు ఉండటం కూడా ఈ మార్కెట్‌కు కలిసి వస్తోంది. గ్రామీణ ఎఫ్‌ఎమ్‌సీజీ మార్కెట్‌ ఏటా 14.6 శాతం సమ్మిళిత వృద్ధితో కొనసాగగలదని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments