Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రవ్యోల్బణం తగ్గింది.. జూలై నెలకు 5.27 శాతం డౌన్

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (23:45 IST)
ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ ఏడాది జూలై నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.27 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. జూన్ నెలలో ఇది 5.57 శాతంగానూ, గతేడాది జూలైలో 5.33 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 
 
పాలు, ఉల్లి, టమోటాలతో పాటు వంట గ్యాస్, ప్రయాణ రేట్లు, పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణంగా నిలిచాయి. ఇదే సమయంలో వంట నూనె, చేపలు వంటి వాటి ధరలు పడిపోవడం కొంతమేర ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.
 
ఆహార ద్రవ్యోల్బణం 4.91 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది 5.61 శాతంగా, గతేడాది జూలైలో 6.38 శాతంగా నమోదైంది. మరోవైపు ముడి చమురు మినహా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల నమోదైంది. జూలైలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 9.4 శాతం పెరిగింది. గతేడాది కొవిడ్ వల్ల ప్రధాన రంగాల ఉత్పత్తి ఇదే నెలలో 7.6 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments