Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపాల్‌ హాస్పిటల్స్‌ వద్ద మల్టీ-డిసిప్లీనరీ స్మార్ట్‌ ఐసీయు

Advertiesment
MULTI-DISCIPLINARY SMART ICU
, సోమవారం, 30 ఆగస్టు 2021 (19:21 IST)
కృష్ణా, గుంటూరు జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాలలో అవసరమైన సకల సదుపాయాలూ మరియు సేవలను కలిగి ఉండి మల్టీ స్పెషాలిటీ  క్రిటికల్‌ కేర్‌ చికిత్సను అందిస్తున్న కార్పోరేట్‌ హాస్పిటల్‌ మణిపాల్‌ హాస్పిటల్స్‌. అత్యున్నత సమర్థత, నైపుణ్యం కలిగిన డాక్టర్లు 24 గంటలూ క్రిటికల్‌ కేర్‌ కేసులకు చికిత్సనందించడానికి సిద్ధంగా ఉంటారు.
 
తాము అందిస్తున్న క్రిటికల్‌ కేర్‌ గురించి మణిపాల్‌ హాస్పిటల్‌లో ఇన్‌చార్జ్‌ కన్సల్టెంట్‌-ఐసీయు మరియు క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌గా సేవలనందిస్తున్న డాక్టర్‌ టి. శ్రీనివాస్‌ గారు మాట్లాడుతూ, ‘‘క్లిష్టమైన మరియు అతిముఖ్యమైన కేసులకు ఐ.సి.యు కేర్‌ ద్వారా చికిత్స అందించడం జరుగుతుంది. మణిపాల్‌ హాస్పిటల్‌ నందు, తాము అవసరమైన అన్ని స్మార్ట్‌ ఐసీయు సదుపాయాలు కలిగి ఉన్నాము. వీటితో పాటుగా కోవిడేతర సమస్యలకు చికిత్సనందించేందుకు ట్రాన్స్‌ప్లాంట్‌ ఐసీయుసేవలు, మెడికల్‌ ఐసీయు సేవలు సైతం కలిగి ఉన్నాము.
 
ఈ ఆధునిక ప్రపంచ అవసరాలకు తగినట్లుగా మేము, సాంకేతికతను మిళితం చేసి మా స్మార్ట్‌ ఐసీయులను ఏర్పాటుచేశాం. తద్వారా డాక్టర్లు మరియు నర్సులు అనుక్షణం రోగి అవయవాల పనితీరు, ప్రమాణాలను డాటా మానిటరింగ్‌ ద్వారా పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. దానితో సమయానికి తగినట్లుగా, అత్యుత్తమ చికిత్సనందించడం తద్వారా మెరుగైన ఫలితాలను సాధించడం వీలవుతుంది.
 
ఉదాహరణకు, ఒక యువతి తన పని సమయంలో ప్రమాదవశాత్తు మెషీన్‌లో దుపట్టా చుట్టుకుపోవడం వల్ల గొంతు బిగుసుకుపోయి శ్వాసించడం అసాధ్యమైన పరిస్థితులలో మణిపాల్‌కు తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు ఉరికంబంపై ఉండేటటువంటి పీడస్థితికి సమానం. మరొక ఆసక్తికరమైన మరణాన్ని జయించిన సంఘటన, ప్రమాదవశాత్తు హాస్టల్‌ మూడవ అంతస్తుపై నుంచి  పడిపోయి తొలి జీసీఎస్‌(కోమా స్కేల్‌)తో అచేతనంగా వచ్చిన విద్యార్థిని బ్రతికే అవకాశం దాదాపు అసాధ్యం అనుకున్న దశలో మణిపాల్‌కు వచ్చారు. ఇటువంటి ఎన్నో వైవిధ్య భరిత కేసులకు ఐసీయు వైద్య సిబ్బంది చికిత్స అందించారు’’ అని అన్నారు.
 
అవయవ మార్పిడికి ముందు మరియు అవయవ మార్పిడి తరువాత సమయాలలో ట్రాన్స్‌ప్లాంట్‌ ఐసీయు (టీఐసీయు) రోగిని విస్తృతశ్రేణిలో పర్యవేక్షించేందుకు, వెంటిలేటర్‌ కేర్‌ మరియు క్రిటికల్‌ కేర్‌ మద్దతును అవయవ మార్పిడి శస్త్రచికిత్సలైనటువంటి కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె మరియు బోన్‌మారో తరహా ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీలలో అందించేందుకు సహాయపడుతుంది.
 
విస్తృతశ్రేణిలో కేసులకు తగిన పరిష్కారాలనందించడానికి మెడికల్‌ ఐసీయు (ఎంఐసీయు) సామర్థ్యాలు మాకు సహాయపడడంతో పాటుగా అన్ని సమయాలలోనూ సంరక్షణను అందించడానికి పూర్తిగా అంకితమైన సిబ్బందిని సైతం కలిగి ఉన్నాం. స్మార్ట్‌ ఐసీయులలో అత్యాధునిక సాంకేతికతలు ఉంటాయి. ఇవి రోగి సమాచారాన్ని మరియు డాటాను ప్రాసెస్‌ చేయడంతో పాటుగా చికిత్సనందిస్తున్న డాక్టర్లకు సహాయపడుతూనే, అత్యున్నత సమర్థత, నాణ్యత, ప్రభావంతో రోగికి చికిత్సనందించడంలోనూ సహాయపడుతుంది.
 
మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ-హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ఎలాంటి క్రిటికల్‌ కేర్‌ అయినా సరే 24 గంటలూ నాణ్యమైన సంరక్షణను అందించే సామర్థ్యం కలిగిన ఇంటెన్సివిస్ట్‌లను మరియు పూర్తి అంకిత భావం కలిగిన రెసిడెంట్‌ డాక్టర్లును మేము కలిగి ఉన్నాము. మా ఐసీయులు బహుళ అంశాలలో అత్యవసర వైద్య స్థితి అయినటువంటి కార్డియాక్‌, న్యూరో, గ్యాస్ట్రో, ట్రామా మొదలైన వాటికి మెరుగైన చికిత్సనందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. 
విజయవాడలో విభిన్నమైన ఆరోగ్య సమస్యలకు మల్టీ స్పెషాలిటీ చికిత్సలనందించే ఒకే ఒక్క హాస్సిటల్‌గా నిలువడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. మా స్మార్ట్‌ ఐసీయులు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతికతలతో మిళితమయ్యాయి. ఇవన్నీ కూడా నైపుణ్యవంతులైన ప్రొఫెషనల్స్‌ను సైతం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రజలు నాణ్యమైన క్రిటికల్‌ కేర్‌ చికిత్సను చుట్టు పక్కల నగరాలు/రాష్ర్టాలకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ పొందవచ్చు.
 
మా సదుపాయాలు మరియు సేవలకు చక్కటి ప్రశంసలు లభించాయి. 2019వ సంవత్సరంలో ఇంటెన్సివ్‌ కేర్‌కు సంబంధించి  అత్యుత్తమ హాస్పిటల్‌గా ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా చేత మణిపాల్‌ హాస్పిటల్‌ , విజయవాడ గుర్తింపు పొందడంతో పాటుగా విజయవాణి-హెల్త్‌ కేర్‌ ఎచీవర్స్‌ అండ్‌ లీడర్స్‌ చేత ఐసీయులో అత్యుత్తమ రోగి భద్రతా వ్యవస్థ అవార్డును 2015లో అందుకుంది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా చేసుకున్న మేము, ఆ లక్ష్యం సాధించే దిశగా ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్డీఓ చేతులు నరుకుతాం: నారాయణ సంచలన వ్యాఖ్యలు